కడప టైటిల్ సాంగ్ తో మరోసారి రాజేసిన రాంగోపాల్ వర్మ..


Posted on Dec 19 2017 12:10 PM
కడప టైటిల్ సాంగ్ తో మరోసారి రాజేసిన రాంగోపాల్ వర్మ..:

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజా కడప పేరుతో వెబ్ సీరీస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమాగా తెరకెక్కిస్తే సెన్సార్ బోర్డ్ నుంచి ఇబ‍్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో తను అనుకున్నది అనుకున్నట్టుగా తెరకెక్కించేందుకు డిజిటల్ మీడియంను ఎంచుకున్నట్టుగా తెలిపారు వర్మ. అందుకు తగ్గట్టుగా విపరీతమైన రక్తపాతంతో కడప ట్రైలర్ ను రిలీజ్ చేశాడు.

[Watch] Kadapa Title Song here

తాజాగా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించిన టైటిల్ సాంగ్ తో పాటు లిరికల్ వీడియోనే రిలీజ్ చేశాడు. వర్మ ఆస్థాన రచయిత సిరాశ్రీ సాహిత్యమందించిన ఈ పాటకు రవిశంకర్ సంగీతమివ్వగా.. నవరాజ్ హన్స్ ఆలపించాడు. అంతా కొత్తవారితో తెరకెక్కిస్తున్న ఈ సీరీస్ ను ఎన్ అండ్ ఎన్ క్రియేషన్స్, ఏ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ సిరీస్ లో నటించిన వాళ్ళంతా కొత్త వాళ్ళే ! కాగా.. ఈ వెబ్ సిరీస్ అప్పుడే విమర్శలనెదుర్కొంటోంది. రాయలసీమలో హింసను చూపుతున్నామంటూ అసభ్యకరమైన, అశ్లీల సన్నివేశాలను, బూతు డైలాగులను జొప్పిస్తున్నారని, ఇది సీమవాసులను కించపరచేదిగా ఉందన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. సెన్సార్ బెడద లేదంటూ వర్మ ఇలా చెలరేగిపోతున్నాడని దుయ్యబడుతున్నారు. అటు, ఈ టైటిల్ సాంగ్ పై సోషల్ మీడియాలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రక్తచరిత్రమొదలు వర్మ తీసిన అన్ని క్రైం థ్రిల్లర్లన్నీ ఒకే మ్యూజిక్, ఒకే తరహా లెరిక్స్ తో మూస పద్ధతినే వర్మ అనుసరిస్తున్నారని, ఏమాత్రం వీటిలో కొత్తదనం కనిపించడంలేదన్న విమర్శలు వస్తున్నాయి.