Saptagiri LLB Movie Review - Rating 3 / 5


Dec 15 2017 6:06 AM
Saptagiri LLB

Saptagiri LLB Review & Rating

కథ :
చిత్తూరులో ఉంటూ ఎల్.ఎల్.బి పూర్తిచేసిన సప్తగిరి లాయర్ గా ఎదిగిన తర్వాత, తన మేన మామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలనే కలలు కంటుంటాడు. అదే ఉద్దేశ్యంతో హైదరాబాద్ సిటీకి వచ్చి సెషన్స్ కోర్టులో లాయర్ గా చేరి పనిచేస్తుంటాడు. అదే సమయంలో అతను ప్రముఖ లాయర్ రాజ్ పాల్ (సాయి కుమార్) తో వాదించి, ఆల్రెడీ తీర్పునిచ్చిన హిట్ అండ్ రన్ కేసుపై పిల్ వేసి దాన్ని రీ ఓపెన్ చేయిస్తాడు. అసలు ఆ కేసుని ఎందుకు రే- ఓపెన్ చేయించాల్సి వచ్చింది. రాజ్ పాల్ తో పోటి ఎలా ఉంటుంది, అనేది సినిమా.
ప్లస్ పాయింట్స్ :
సప్తగిరి టేక్ అప్ చేసిన కేసులో వాదించే తీరు చాలా బాగుంది. స్క్రిప్ట్ పరంగా బాగా రాసుకున్నా, ఆచరణలో మాత్రం ప్రేక్షకుడిని వాయిన్చేసింది. దానికి సంబంధించి , అతను వివరాలు కనుక్కునే క్రమం ఎంతో బాగుంది. ఇక్కడ కోర్టు సీన్ లో సాయి కుమార్ , సప్తగిరి మధ్యలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సాయి కుమార్ ఎప్పటిలాగే , డైలాగులు ఉన్న పాత్రకి , అగ్ని తోడైనట్టు అధ్బుతంగా చేసారు. ఒక్క క్లైమాక్స్ గనుక ఏమాత్రం తేడా కొట్టినా సినిమా మొత్తం బోల్తా కొట్టేది. అలంటి కొన్ని సన్నివేశాల్లో మాత్రం దర్శకుడి ప్రతిభ బయటపడింది.
మైనస్ పాయింట్స్ :
ఏం చెప్పమంటారు. మొదటి నుండి ఇంటర్వెల్ దాకా ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ బాగా నవ్వుకున్నాం, గుర్తుపెట్టుకున్నాం అనే ఫీలింగ్ తెప్పియ్యలేకపోయింది. అసలు జనాలు ఏమైపోతారనే బాధ ఉండదు ఎందుకో మరి. సప్తగిరి ని పెట్టి కామెడి అన్నా సరిగ్గా పండించుకోపోతే ఇలానే అనిపిస్తుంది. తెలుగు సినిమా ఆచారం ప్రాకారం ఫుల్ బిల్డ్ అప్ తో వచ్చే తెలివైన విలన్ ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో చప్పబడిపోతాడు 1980 లలో సినిమా లో విచారణ మొత్తం అయ్యాక క్లైమాక్స్ లో హీరో స్పీచ్ విని జడ్జీలు తీర్పు ప్రకటించే సన్నివేశాన్ని మళ్ళి ఇన్నేళ్ళ తరువాత ఈ సినిమాలో చూడొచ్చు, దానికి తోడు , సప్తగిరి లవ్ స్టొరీ , రోమాన్స్, వీటికన్నా హై లైట్ మాకు రెండు కళ్ళు ఉండటం. తిడితే తిట్టం అంటారు కాని , సప్తగిరి అంటే మాకు పిచ్చే. ఈ సినిమా అలా పిచ్చిని పటాపంచలు చేసింది.
సాంకేతిక విభాగం :
దర్శకుడు చరణ్ లక్కాకుల సినిమా కోసం ఎంచుకున్న న్యాయం కోసం పోరాడే లాయర్ అనే పాయింట్ బాగానే ఉన్నా ఆకట్టుకునే కథనాన్ని రాయలేదు. ముఖ్యమైన క్లైమాక్స్ ఎపిసోడ్ తప్ప మిగతా వీటి మీదా పెద్దగా దృష్టి పెట్టలేదు అనిపిస్తుంది. సన్నివేశాల టేకింగ్ కూడా ప్రభావవంతంగా లేదు. బుల్గేనిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నా పాటల సంగీతం మెప్పించలేదు. సారంగం సినిమాటోగ్రఫీ బాగుంది, గౌతమ్ రాజు ఎడిటింగ్ పర్వాలేదు. సప్తగిరి వేసిన డ్యాన్సులు బాగున్నాయి. డా. కె.రవి కిరానే పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
మంచి కథను, మంచి నటులని , మంచి పాటలని వాడుకోలేక అనవసరమైన ప్రయోగాలతో ముంచుకున్నారు. మంచి సామాజిక సందేశం ఉన్న సినిమా చూసిన ఫీలింగ్ మాత్రమె మిగులుతుంది. సినిమా గుర్తుండదు.


Tags: Saptagiri LLB Review