MLA Movie Review - Rating 2.75 / 5


Mar 23 2018 9:12 PM
MLA

MLA Review & Rating

నటీనటులు : కళ్యాణ్ రామ్, కాజల్
దర్శకత్వం : ఉపేంద్ర మాధవ్
నిర్మాత : భరత్ చౌదరి, కిరణ్ రెడ్డి
సంగీతం : మణిశర్మ
సినిమాటోగ్రఫర్ : ప్రసాద్ మురెళ్ళ
ఎడిటర్ : తమ్మిరాజు
విడుదల తేదీ : మార్చి 23, 2018
రేటింగ్ : 2.75/5

హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం ‘ఎంఎల్ఏ’. ‘మంచి లక్షణాలున్న అబ్బాయి’ అనేది ఉపశీర్షిక. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీనువైట్ల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఉపేంద్ర మాధవ్ ఈ సినిమాను తెరకెక్కించారు. బ్లూ ప్లానెట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి, టి.జి.విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నేడు (మార్చి 23న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మ‌రి ఈ మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి ఏం చేశాడ‌నేది తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం.

కథ:
కొన్ని అనుకోని కారణాల వల్ల ఇందు (కాజల్) ఇంట్లోనుండి బయటికి వచ్చి ఒక కంపెనీకి ఎం.డి అవుతుంది. అక్కడ కళ్యాణ్ (కళ్యాణ్ రామ్) ఇందును చూసి ప్రేమిస్తాడు. కొంతకాలం తరువాత ఇద్దరు ఇష్టపడతారు. ఒక సందర్భంలో ఇందు తల్లితండ్రులు ఇందుతో పెళ్లి జరగాలంటే ఎం.ఎల్. ఏ అవ్వాలని కళ్యాణ్ కు షరతు పెడతారు. అసలు ఇందు తల్లిదండ్రులు కళ్యాణ్ కు ఎం.ఎల్.ఏ అవ్వాలనే కండిషన్ ఎందుకు పెట్టారు ? ఎం.ఎల్.ఏ అవ్వడానికి కళ్యాణ్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేదే ఈ సినిమా కథ.

విశ్లేష‌ణ‌:
కల్యాణ్ రామ్ లుక్ ప‌రంగా కొత్త‌గా ఉన్నాడు. బ‌రువు త‌గ్గ‌డం.. కాస్ట్యూమ్స్ విష‌యంలో తీసుకున్న శ్ర‌ద్ధ కార‌ణంగా ఆ కొత్త‌దనం మ‌న‌కు క‌న‌ప‌డుతుంది. ఇక క‌ల్యాణ్ రామ్ త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. కాజ‌ల్ పాత్ర‌కు పెద్ద స్కోప్ లేదు. కాజ‌ల్ లుక్స్ ప‌రంగా చూడ‌టానికి అందంగా క‌న‌ప‌డింది. ఇక సినిమాలో మ‌రో మెయిన్ పాత్ర విల‌న్ ర‌వికిష‌న్‌. సినిమా ప్ర‌థ‌మార్థంలో అంద‌రూ భ‌య‌ప‌డేలా ఉండే విల‌న్ సెకండాఫ్‌కి వ‌చ్చేసరికి ఓ జోక‌ర్‌లా మారిపోతాడు. హీరో అత‌న్ని ఆట ప‌ట్టిస్తుంటాడు. ఇది క‌మ‌ర్షియ‌ల్ మూవీస్‌లో విల‌న్ రేంజ్‌. అదే రేంజ్ ఈ సినిమాలో కూడా క‌న‌ప‌డుతుంది. ర‌వికిష‌న్ విల‌నిజాన్ని స‌రిగ్గా వాడుకోలేద‌నిపించింది. కామెడీ ట్రాక్ చాలా సిల్లీగా క‌న‌ప‌డుతుంది. ఇక సెకండాఫ్‌కు వ‌చ్చేస‌రికి సినిమా అంతా విలేజ్‌లోనే అక్క‌డి రాజ‌కీయ గొడ‌వ‌ల మ‌ధ్య సాగుతుంది. ఆ గొడ‌వ‌లు కూడా ఇంత‌కు ముందు చూసేసిన సినిమాల్లోని సన్నివేశాల‌ను త‌ల‌పించేలా సాగాయి. లాజిక్ లేని సీన్స్‌తో బోర్ కొట్టేస్తుంది. ఇక ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ క‌థ ప‌రంగా ఏమాత్రం కొత్త‌ద‌నం క‌న‌ప‌డ‌లేదు. అన్ని క‌థ‌ల‌ను మిక్సీలో వేసుకుని క‌లిపి కొట్టి ప‌క్కా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ చేసి ఆక‌ట్టుకోవాల‌నుకునే ప్ర‌య‌త్నం బెడిసి కొట్టింది. కమర్షియల్‌ విలువలతో పాటు చిన్న పిల్లలు చదువుకోవాలి తప్ప పనికి వెళ్ల కూడదు అనే మంచి పాయింట్‌ని చూపించాడు. ప్రతి సన్నివేశం ఊహకు అందుతూ సాగుతుంటుంది. కానీ వినోదం మాత్రం ఖాయం. చాలా సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా ఉంటాయి.

సాంకేతిక విభాగం:
ఈ సినిమాతో దర్శకుడిగా మారిన ఉపేంద్ర మాధవ్ తను రాసుకున్న పిల్లలకు ఆస్తులు ఇస్తే అవి ఉంటేనే బ్రతుకుతారు, అదే చదువు ఇస్తే ఎలాగైనా బ్రతుకుతారు వంటి డైలాగ్స్ బాగున్నాయి. కానీ దర్శకుడిగా మాత్రం జస్ట్ ఓకే అనే పనితనం మాత్రమే కనబర్చాడు. రొటీన్ స్టోరీని ఎంచుకుని పర్వాలేదనే రీతిలో సినిమాను తెరకెక్కించారు.
ప్రసాద్ మురెళ్ళ కెమెరా పనితనం బాగుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాకు పనిచేసిన ఆయన ఈ సినిమాతో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. మణిశర్మ పాటలకు అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగానే ఉంది. పైన చెప్పినట్టు నిర్మాణ విలువలు మంచి స్థాయిలోనే ఉన్నాయి.

తీర్పు:
మొత్తం మీద ఈ ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం అక్కడక్కడా అలరించిన రెగ్యులర్ కమర్షియల్ సినిమా అనొచ్చు. కళ్యాణ్ రామ్, రవికిషన్ ల మద్యన నడిచే సన్నివేశాలు, ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్, కళ్యాణ్ రామ్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా రెగ్యులర్ ఫార్మాట్లో ఉన్న స్టోరీ, రొటీన్ స్క్రీన్ ప్లే వలన ఇందులో ఎలాంటి కొత్తదనం దొరకదు. కాబట్టి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని కోరుకునే వారికి ఈ చిత్రం సరిపోతుంది కానీ కొత్తదనం ఆశించేవారు మాత్రం వేరే ఆప్షన్ చూసుకోవడం మంచిది.


Tags: MLA Review , MLA Movie Review , MLA telugu Review , MLA Review in telugu fonts , MLA Rating , MLA review and rating , Kalyanram MLA - Manchi Lakshanalunna abbayi Review.