Needi Naadi Oke katha Movie Review - Rating 3.5 / 5


Mar 23 2018 9:01 PM
Needi Naadi Oke katha

Needi Naadi Oke katha Review & Rating

నటీనటులు : శ్రీవిష్ణు, దేవి శ్రీ ప్రసాద్, సాట్నా టిటస్
దర్శకత్వం : వేణు ఊడుగుల
నిర్మాత : ప్రశాంతి, కృష్ణ విజయ్
సంగీతం : సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫర్ : రాజు తోట
ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి స్క్రీన్ ప్లే : వేణు ఊడుగుల
విడుదల తేదీ : మార్చి 23, 2018
రేటింగ్ : 3.5/5

నీదీ నాదీ ఒకే కథ.. విభిన్న కథలతో వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం. వేణు ఉడుగుల దర్శకత్వంలో ఈ సినిమాలో బిచ్చగాడు ఫేం సట్నా టైటస్‌ హీరోయిన్‌ గా నటించింది. నారా రోహిత్‌ సమర్పణలో ప్రశాంతి, కృష్ణ విజయ్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కొత్త కథతో పాటు, ఆ కథ చెప్పడానికి డాగ్ మి 95 అనే కొత్త పద్ధతిని ఉపయోగించారు. నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కథ ఎలా ఉందొ తెలుసుకుందాం.

కథ :
ఒక లెక్చరర్ కొడుకైన సాగర్ (శ్రీవిష్ణు) కు చిన్నప్పటి నుండి చదువు సరిగా ఎక్కదు. బ్రతకడమంటే నచ్చిన పని చేసుకుని సంతోషంగా ఉండటమే అనుకునే సాగర్ తాను అమితంగా ప్రేమించే తండ్రిని మెప్పించాలని డిగ్రీ పాసవడానికి సప్లిమెంటరీ పరీక్షలు రాస్తూ ఇబ్బందిపడుతూ ఉంటాడు. ఒకానొక దశలో తనకు నచ్చింది చేయడానికి వీలుకాక, తండ్రికి నచ్చినట్టు మారలేక తీవ్ర ఒత్తిడికి, వేదనకు గురై ఇంట్లోంచి కూడ బయటికొచ్చేస్తాడు. అలా బయటికొచ్చిన సాగర్ ఏమయ్యాడు, చివరికి అతని భాధ అతని తండ్రికి అర్థమయ్యిందా లేదా అనేదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
– కథ, కథనం
– శ్రీ విష్ణు నటన
– సంగీతం

మైనస్ పాయింట్స్ :
– సెకండాఫ్‌‌లో రొటీన్‌గా సాగడం
– కమర్షియల్ హంగులు లేకపోవడం
– కామెడీ లేకపోవడం

సాంకేతిక విభాగం :
దర్శకుడు వేణు ఊడుగులు సహజమైన నైపథ్యంలో కథను రాసుకుని, అందులో ప్రేక్షకులను ఒడిసి పట్టుకోగల పాత్రల్ని ప్రవేశపెట్టి మంచి సన్నివేశాలతో, అందరికీ అవసరమైన సందేశాన్ని ఇస్తూ మంచి సినిమా తీశారు. చిన్న చిన్న పొరపాట్లు మినహా మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశారాయన. సహజమైన లొకేషన్లలో చేసిన రాజు తోట సినిమాటోగ్రఫీ బాగుంది. సురేష్ బొబ్బిలి అందించిన నైపథ్య సంగీతం బాగుంది. బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు ప్రశాంతి, కృష్ణ విజయ్ లు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:
అస్సలు కమర్షియల్ విలువలు లేని ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు ఎలా రాబడుతుందో చూడాలి. ఒకవేళ అన్ని వర్గాల ప్రేక్షకులికి నచ్చితే కనుక చిన్ని సినిమాల్లో ఇదో సంచలనం అవ్వడం ఖాయం.


Tags: Needi Naadi Oke katha Movie review , Needi Naadi Oke katha Review , Needi Naadi Oke katha Review in Telugu , Needi Naadi Oke katha Telugu Movie Review , Sree Vishnu Needi Naadi Oke katha Rating , Needi Naadi Oke katha Movie Review and Rating.