Anandam Movie Review - Rating 2.5 / 5


Mar 23 2018 8:52 PM
Anandam

Anandam Review & Rating

నటీనటులు : అరుణ్‌ కురియన్, థామస్ మాథ్యూ, రోషన్ మాథ్యూ, అను ఆంటోనీ
దర్శకత్వం : గణేష్ రాజ్
నిర్మాత : గురురాజ్
సంగీతం : సచిన్ వారియర్
సినిమాటోగ్రఫర్ : ఆనంద్ ఇ చంద్రన్
ఎడిటర్ : అభినవ్ సుందర్ నాయక్
విడుదల తేదీ : మార్చి 23, 2018
రేటింగ్ : 2.5/5

కథ: కంప్యూటర్‌ సైన్స్ ఇంజీనిరింగ్‌ చదివే విద్యార్థులు కాలేజ్‌ తరుపున ఇండస్ట్రియల్‌ విజిట్‌కు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. ఈ టూర్‌ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చాలా ప్లాన్స్‌ వేస్తారు. కాలేజ్‌ మేనేజ్‌మెంట్‌ సౌత్‌ ఇండియా వరకు మాత్రమే పర్మిషన్‌ ఇవ్వటంతో ముందు హంపీ వెళ్లి తరువాత గోవాలో న్యూ ఇయర్‌ పార్టీ సెలబ్రేట్‌ చేసుకోవాలని ప్లాన్‌ చేస్తారు. (సాక్షి రివ్యూస్‌) ప్రధానంగా ఏడుగురు విద్యార్థుల చుట్టూనే కథ నడుస్తుంది. విభిన్న వ్యక్తిత్వాలున్న ఆ విద్యార్థులకు ఈ టూర్‌ ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది..? వారిలో వ‍్యక్తిత్వాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..? అన్నదే మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :
- సినిమాటోగ్రఫి
- కొన్ని సరదా సన్నివేశాలు

మైనస్ పాయింట్స్ :
- కథా కథనం

సాంకేతిక వర్గం:
దర్శకుడు గణేష్ రాజ్ రాసుకున్న పాయింట్ పాతదే అయినప్పటికీ దాన్ని ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన విఫలమయ్యాడు. కానీ ఆయన పాత్రల్ని డిజైన్ చేసిన విధానం మాత్రం ఆకట్టుకుంది. సచిన్ వారియర్ అందించిన సంగీతం గొప్పగా లేదు. ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలని ఎడిట్ చేసుంటే బాగుండేది. గోవా, హంపి వంటి విహారయాత్ర ప్రదేశాలను సినిమాటోగ్రఫర్ బాగా చూపించడం జరిగింది.

తీర్పు:
మొత్తం మీద ఈ చిత్రం ఎమోషన్స్ మీద నడిచే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అనొచ్చు. సినిమాలోని కథ పేక్షకుల్లకు తమ కాలేజీ రోజుల్ని గుర్తుచేస్తుంది. సినిమాను చివర్లో బాగానే ముగించిన ఫస్టాఫ్ మొత్తం నీరసంగా, సాగదీసినట్టు సాగడం, కథ మన తెలుగు ప్రేక్షకులకు పాతదే కావడం, పాత్రలన్నీ బాగానే ఉన్న అందులో నటించిన వారు పూర్తిగా కొత్తవారు కావడంతో సినిమా బిలో యావరేజ్ గా నిలిచింది.


Tags: Anandam Review , Anandam Movie review , Anandam telugu review , Anandam Movie review in telugu Fonts , Anandam.