Kirrak Party Movie Review - Rating 3.5 / 5


Mar 16 2018 9:52 PM
Kirrak Party

Kirrak Party Review & Rating

నటీనటులు : నిఖిల్, సిమ్రన్ పరీన్జ, సంయుక్త హెగ్డే
దర్శకత్వం : శరన్ కొప్పిశెట్టి
నిర్మాత : సుంకర రామబ్రహ్మం
సంగీతం : అంజనీష్ లోకనాథ్
సినిమాటోగ్రఫర్ : అద్వైత గురుమూర్తి
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ
స్క్రీన్ ప్లే : సుధీర్ వర్మ
రేటింగ్ : 3/5
విడుదల తేదీ : మార్చి 16, 2018

రొటీన్ కమర్షియల్ చిత్రాలను పక్కన పెట్టి సరికొత్త కథలను ఎన్నుకుంటూ వరుస విజయాలను అందుకుంటున్న హీరో నిఖిల్. తాజాగా కన్నడలో ఘన విజయం సాధించిన ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాను ‘కిరాక్ పార్టీ’ అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :
స్నేహితులతో కలిసి సరదాగా జీవితాన్ని ఎంజాయ్ చేసే ఇంజనీరింగ్ విద్యార్థి కృష్ణ (నిఖిల్) మొదటి సంవత్సరంలోనే నాల్గవ సంవత్సరం చదువుతున్న మీర(సిమ్రన్ పరీన్జ)ను ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని పేమిస్తుంది. కానీ అంతలోనే ఆమె అతనికి దూరమవుతుంది.
దాంతో ఎప్పుడూ సరదాగా ఉండే కృష్ణ కఠినంగా మారిపోతాడు. ఎలక్షన్స్ అంటూ ఎప్పుడూ గొడవల్లోనే ఉంటుంటాడు. అలాంటి అతన్ని సత్య (సంయుక్త హెగ్డే) అనే జూనియర్ ప్రేమిస్తుంది. కానీ కృష్ణ మాత్రం మీర జ్ఞాపకాల్లోనే ఉండిపోతాడు. అలాంటి అతన్ని సత్య ఎలా మార్చింది, అసలు మీర కృష్ణకు ఎలా దూరమైంది, ఆ భాదతో కృష్ణ ఎలా తయారయ్యాడు అనేదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :
--నిఖిల్‌ నటన
- సంగీతం

మైనస్ పాయింట్స్ :
సినిమా నిడివి

నటీనటులు :
కృష్ణ పాత్రలో నిఖిల్ మంచి నటన కనబరిచాడు. స్టూడెంట్‌ గా తనకు అలవాటైన ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో మెప్పించటంతో పాటు సెకండ్‌ హాఫ్‌లో మెచ్యూర్డ్‌ గా కనిపించి ఆకట్టుకున్నాడు. లుక్‌ విషయంలోనూ మంచి వేరియేషన్‌ చూపించాడు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌తో పాటు క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ లో నిఖిల్ నటన చాలా బాగుంది. సినిమా సినిమాకు మంచి పరిణతి కనబరుస్తున్నాడు నిఖిల్‌. ఫస్ట్‌హాఫ్ లో హీరోయిన్‌ గా కనిపించిన సిమ్రాన్‌ హుందాగా కనిపించింది. సెటిల్డ్‌ పర్ఫామెన్స్‌తో ఆకట్టుకుంది. (సాక్షి రివ్యూస్‌)మరో హీరోయిన్‌ సంయుక్త హెగ్డే బబ్లీ గర్ల్ గా కనిపించి సెంకడ్‌హాఫ్‌ లో జోష్ నింపే ప్రయత్నం చేసింది. బ్రహ్మాజీది చిన్న పాత్రే అయినా ఉన్నంతలో మంచి కామెడీ పండించాడు. ఫ్రెండ్స్ పాత్రలో కనిపించిన నటీనటులు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం :
కథనాన్ని అందించిన సుధీర్ వర్మ మొదటి అర్ధభాగాన్ని బాగానే రాసినా ద్వితీయార్థాన్ని మాత్రం పేలవంగా రాయడంతో దర్శకుడు శరన్ కొప్పిశెట్టి పూర్తి స్థాయిలో ఇంప్రెస్ చేయలేకపోయారు. దీంతో సినిమా రెండవ సగం ఫన్, ఎమోషన్ ఏదీ పూర్తిస్థాయిలో పండలేదు. చందూ మొండేటి రాసిన డైలాగ్స్ బాగానే పర్వాలేదనిపించాయి.
నిర్మాణ సంస్థ ఏకే ఎంటెర్టైమెంట్స్ ఎప్పటిలాగే మంచి నిర్మాణ విలువల్ని పాటించి తమ స్థాయిని చాటుకుంది. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ ద్వారా సెకండాఫ్లోని కొన్ని అనవసరమైన సన్నివేశాలని తొలగించాల్సింది. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ ఫ్రెష్ ఫీల్ ను అందించగా అంజనీష్ లోకనాథ్ సంగీతం మెప్పించింది.

తీర్పు :
నిఖిల్ చేసిన ఈ ‘కిరాక్ పార్టీ’ కొంత ఫన్ తో, ఇంకొంత కామెడీతో నడిచిందని చెప్పొచ్చు. నవ్వించే ఫస్టాఫ్ ఫన్, ఎమోషనల్ గా అనిపించే ఇంటర్వెల్ భాగం, ఇంప్రెస్ చేసిన నిఖిల్ పెర్ఫార్మెన్స్, యువతకు కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చే సినిమా నైపథ్యం ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు కాగా పూర్తిగా పక్కదారి పట్టిన ద్వితీయార్థం, ఇంప్రెస్ చేయలేకపోయిన కీలక సన్నివేశాలు నిరుత్సాహపరుస్తాయి. మొత్తం మీద యూత్ ఫుల్ కంటెంట్ ను కలిగి ఉన్న ఈ చిత్రం యువతను ఆకట్టుకుంటుంది.


Tags: Kirrak Party Telugu Movie Review | Nikhil Kirrak Party Movie Review | Kirrak Party Movie Review | Nikhil Kirrak Party Telugu Movie Review | Kirrak Party Telugu Movie Review and Rating | Kirrak Party Telugu Movie Review | Nikhil Kirrak Party Telugu Cinema Review | Kirrak Party Telugu Film Review | Nikhil Kirrak Party Telugu Movie Review | Telugu Cinema News in Telugu