AWE - ‘అ !’ Movie Review - Rating 3.25 / 5


Feb 16 2018 6:54 PM
AWE - ‘అ !’

AWE - ‘అ !’ Review & Rating

నటీనటులు : కాజల్, నిత్యా మీనన్, ఈషా రెబ్బ, రెజినా కసాండ్రా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళీ శర్మ, దేవ దర్శిని
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత : ప్రశాంతి త్రిపురనేని
సంగీతం : మార్క్.కె. రాబిన్
సినిమాటోగ్రఫర్ : కార్తీక్ ఘట్టమనేని
ఎడిటర్ : గౌతమ్ నెరుసు
రేటింగ్ : 3.25/5
విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018

నాని నిర్మాతగా తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నిర్మించిన తొలి చిత్రం ‘అ!’. ప్రశాంత్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. మొదటి నుండి ఇది కమర్షియల్ సినిమా కాదు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రమని నాని చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :
ఓ రెస్టారెంట్ నేపథ్యంలో సాగే ఈ కథలో కాలి ( కాజల్ అగర్వాల్ ) తీవ్ర ఒత్తిడికి లోనౌతూ మర్డర్స్ చేయాలనీ ప్రయత్నాలు చేస్తుంటుంది . అదే సమయంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన క్రిష్ ( నిత్యా మీనన్ ) రాధా ( ఈషా )మీరా ( రెజీనా )శివ ( అవసరాల శ్రీనివాస్ )నలభీమ ( ప్రియదర్శి )రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు . అసలు వీళ్లంతా ఎవరు ? కాలి ఇతరులను చంపాలని ఎందుకు అనుకుంటుంది ? చివరకు ఏమైంది ? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :
కథ
నటీనటుల పెర్ఫార్మెన్స్
డైరెక్షన్
ఛాయాగ్రహణం
సందేశం

డ్రా బ్యాక్స్ :
అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు లేకపోవడం

నటీనటుల ప్రతిభ :
సినిమా మొత్తం ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నా ఎవరికి వారు తమ రోల్ లో పర్ఫెక్ట్ అనిపించుకున్నారు. అందరికి అ! ఓ కొత్త ప్రయత్నమే. ఇదవరకు ఇమేజ్ కు కాస్త భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. కాజల్, రెజినా, నిత్యాల పర్ఫార్మెన్స్ అందరికి నచ్చుతుంది. ఇక ఈషా, అవసరాల, ప్రియదర్శి ఇలా చేసిన అందరు బాగా చేశారు. నాని, రవితేజల వాయిస్ ఓవర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుంది.

సాంకేతిక విభాగం :
దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆలోచన, ఎగ్జిక్యూషన్ ను మెచ్చుకుని తీరవలసిందే. పేపర్ మీదే తికమకగా అనిపించే ఈ కథను కొన్ని చిన్న చిన్న లోపాలున్నా తెర మీద సాద్యమైనంత వరకు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తీయడానికి ప్రయత్నించిన అతని ప్రయత్నం బాగుంది.
కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మొత్తని సింగిల్ లొకేషన్లో తీసినా ఎక్కడా సన్నివేశాలు బోర్ కొట్టకుండా చిత్రీకరించాడు. మార్క్.కె. రాబిన్ నైపథ్య సంగీతం చాలా బాగుంది. సన్నివేశాలకు అదనపు బలాన్ని చేకూర్చింది. గౌతమ్ నెరుసు ఎడిటింగ్ బాగానే ఉన్నా సెకండాఫ్లో ఇంకాస్త క్లారిటీ మైంటైన్ చేసుండాల్సింది. నిర్మాతగా నాని ఒక ప్రయోగాత్మక చిత్రానికి కావల్సిన మంచి నటీనటుల్ని, మంచి బడ్జెట్ ను కేటాయించి తన వంతు న్యాయం చేసి కొత్తదనానికి సరైన పోరుత్సాహన్ని అందించారు.

తీర్పు :
ఈ ‘అ !’ చిత్రం మొదటి నుండి నిర్మాత నాని, దర్శకుడు ప్రశాంత్ వర్మలు చెబుతున్నట్టే రెగ్యులర్ సినిమాల కోణం నుండి చూడాల్సిన సినిమా కాదు. దర్శకుడు సింపుల్ లైన్ కు తెలివైన కథనాన్ని, బలమైన పాత్రల్ని, సన్నివేశాల్ని, థ్రిల్ చేసే ఇంటర్వెల్, ఆశ్చర్యపరిచే ముగింపును జోడించడంతో సినిమా కొత్తగా, ఆశ్చర్యపోయే విధంగా తయారైంది. కానీ ద్వితీయార్థంలోనే కొన్ని సీన్స్ తికమకపెట్టాయి. మొత్తం మీద సినిమా బి, సి సెంటర్ల ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోకవచ్చు కానీ కొత్తదనాన్ని స్వాగతించే వారికి మాత్రం తప్పకుండా నచ్చుతుంది.


Tags: awe telugu movie review ,kajal aggarwal awe telugu movie review ,nani awe movie review ,awe telugu movie review and rating ,awe movie review ,awe review and rating ,awe telugu review and rating ,awe telugu cinema review ,awe film review ,awe movie review in telugu ,awe telugu review ,awe cinema review ,awe review