Manasuku Nachindi Movie Review - Rating 3 / 5


Feb 16 2018 6:42 PM
Manasuku Nachindi

Manasuku Nachindi Review & Rating

నటీనటులు : సందీప్ కిషన్, అమైర దస్తూర్, త్రిదా చౌదరి, అదిత్
దర్శకత్వం : మంజుల
నిర్మాత : జెమిని కిరణ్, సంజెయ్ స్వరూప్
సంగీతం : రాధన్
సినిమాటోగ్రఫర్ : రవి యాదవ్
ఎడిటర్ : సతీష్ సూర్య
రేటింగ్: ౩/5
విడుదల తేదీ : ఫిబ్రవరి 16, 2018

షో సినిమాతో నటిగా, నిర్మాతగా తన టాలెంట్ ఏంటో చూపించి జాతీయ గుర్తింపు తేచుకున్న సూపర్ స్టార్ కృష్ణ వారసురాలు మంజుల తాజాగా దర్శకురలుగా మరి "మనసుకు నచ్చింది" మొదటి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సందీప్ కిషన్, అమైరా దస్తూర్ ముఖ్య నటులుగా తెరకేకిన ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించటంతో మరింత హైప్ క్రియేట్‌ అయ్యింది. నిర్మాతగా, నటిగా ప్రూవ్ చేస్కున్న మంజుల దర్శకురాలిగా సక్సెస్ సాధించిందా..? మనసుకు నచ్చింది అందరి మనసులకి నచింద లేదా..?

కథ
సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య (అమైరా దస్తూర్‌) చిన్నపటి నుండి మంచి స్నేహితులు. ఒకరోజు వీరిద్దరికి పెళ్ళి చెయ్యాలని నిర్ణయిస్తారు కుటుంబ సభ్యులు. ఆ పెళ్ళి ఇష్టం లేని వీరిద్దరు గోవా పారిపోతారు. అక్కడ వీరిద్దరికి (త్రిదా చౌదరి) లిఖిత పరిచయమవుతుంది. కొంత కాలానికి లిఖిత, సూరజ్ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. నిత్య, సూరజ్ ను ఇష్టపడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది ? సూరజ్, నిత్య ప్రేమ ఫలించిందా ? లిఖిత, సూరజ్ మధ్య ప్రేమ ఎంతవరకు వచ్చింది ? తెలుసుకోవాలనుకుంటే ‘మనసుకు నచ్చింది’ చూడాల్సిందే.

నటీనటులు :
సందీప్‌ కిషన్‌ తనకు అలవాటైన యూత్‌ ఫుల్‌ క్యారెక్టర్ లో కనిపించాడు. అయితే ఎమోషనల్‌ సీన్స్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌ లో వచ్చే చాలా సన్నివేశాల్లో సందీప్‌ నటన నిరాశపరుస్తుంది. హీరోయిన్‌ అమైర దస్తూర్‌ అందంతో ఆకట్టుకుంది. నటన పరంగానూ పరవాలేదనిపించింది. మరో హీరోయిన్‌గా నటించిన త్రిదా చౌదరి పూర్తిగా గ్లామర్‌ షోకే పరిమితమైంది. ప్రియదర్శి లాంటి లీడింగ్ కమెడియన్‌ను హీరో ఫ్రెండ్‌ పాత్రకు తీసుకున్నా.. సరిగ్గా ఉపయోగించుకోలేదు. ప్రియదర్శి డైలాగ్స్‌లో గత చిత్రాల్లో కనిపించే చమక్కులు ఈ సినిమాలో మిస్‌ అయ్యాయి. ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఘట్టమనేని వారసురాలు, మంజుల కూతురు జాన్వీ మంచి నటన కనబరించింది. ఇంగ్లీష్ కలిసి తెలుగు యాక్సెంట్‌లో జాన్వీ చెప్పిన డైలాగ్స్‌ అలరిస్తాయి. ఇతర పాత్రలు పెద్దగా తెర మీద కనిపించవు. అదిత్‌ అరుణ్‌, నాజర్‌, సంజయ్‌, అనితా చౌదరిలవి దాదాపుగా అతిథి పాత్రలే. ప్లస్ పాయింట్స్ :
సినిమాటోగ్రఫి
హీరోయిన్ల గ్లామర్‌

మైనస్ పాయింట్స్ :
కథా కథనం

సాంకేతిక వర్గం:
సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. ముఖ్యంగా రవి యాదవ్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ను రీఫ్రెషింగా తయారుచేసింది. గోవాలో చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. డైలాగ్స్ బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. మొదటి అర్ధభాగం కొన్ని సన్నివేశాలని ట్రిమ్ చేసి ఉండాల్సింది. సంగీతం పర్వాలేదు.
డైరెక్టర్ మంజుల విషయానికొస్తే ప్రేమికులిద్దరినీ ప్రకృతితో కనెక్ట్ చేసి దానితో మనుషులు ఎలా మమేకమవ్వాలో చూపించాలనే ఆమె ఆలోచన బాగానే ఉన్నా తెరపై ఎగ్జిక్యూషన్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. సినిమాను మొదలుపెట్టిన విధానం, మలుపులు అన్నీ సర్వ సాధారణంగానే ఉన్నాయి. డ్రామా, రొమాన్స్ కు మంచి అవకాశమే ఉన్నా వాటిని పండించలేకపోయారామె. చిత్ర నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:
మనసుకి నచ్చింది.. అటు ఇటుగా మనసుకి నచ్చేలా ఉంది..!


Tags: Manasuku Nachindi Review , Manasuku Nachindi Telugu Movie Review , Sandeep Kishan Manasuku Nachindi Movie Review , Manasuku Nachindi Rating & Review ,