Hello Movie Review - Rating 3.25 / 5


Dec 22 2017 12:55 PM
Hello

Hello Review & Rating

సినిమా : హలో
నటీనటులు : అఖిల్, కళ్యాణి ప్రియదర్శన్, అజయ్, జగపతిబాబు, రమ్యకృష్ణ, తదితరులు
కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : విక్రమ్‌ కె.కుమార్
నిర్మాత : నాగార్జున
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : పిఎస్ వినోద్
ఎడిటర్ : ప్రవిణ్ పూడి
బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్
రిలీజ్ డేట్ : 22-12-2017

దేశంలో గర్వించదగ్గ ట్యాలెంటెడ్ దర్శకుల్లో విక్రమ్ కె.కుమార్ ఒకడు. ‘13బి’, ‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి సూపర్ హిట్ చిత్రాల్ని తెరకెక్కించిన ఈ దర్శకుడు.. తన స్ర్కీన్‌ప్లే మ్యాజిక్‌తో ప్రేక్షకులను మైమరపించేశాడు. ఇప్పుడు ‘హలో’ చిత్రంలో మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడు. అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రయదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని నాగార్జున తన హోమ్ బ్యానర్ ‘అన్నపూర్ణ స్టూడియోస్’పై నిర్మించాడు. ఈ చిత్రంపై మొదటినుంచే భారీ అంచనాలున్నాయి. టీజర్, ట్రైలర్‌లతో అవి తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక నాగార్జున కూడా ఎలాగైనా తన తనయుడికి హిట్ ఇవ్వాలనే ఉద్దేశంతో భారీగా ప్రమోషన్స్ చేశాడు. మరి.. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించగలిగిందా? విక్రమ్ మరోసారి తన మార్క్ స్ర్కీన్‌ప్లే మ్యాజిక్‌ని రిపీట్ చేయగలిగాడా? నాగ్ అన్నట్లుగా ఇది అఖిల్‌ రీఎంట్రీకి ఈ చిత్రం హెల్ప్ అయ్యిందా? రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం..
కథ :
చిన్నప్పుడు అఖిల్, కళ్యాణి అనుకోకుండా కలుస్తారు. ఇంతలోనే ఆ ఇద్దరూ దూరమైపోతారు. విడిపోతున్న టైంలో అఖిల్‌కి కళ్యాణి తన ఫోన్ నెంబర్ ఇచ్చి వెళుతుంది. అప్పటినుంచి ఆమెకి అఖిల్ ఫోన్ చేయగా.. కళ్యాణి నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఇలాగే 15 ఏళ్లు గడిచిపోతాయి. అన్నేళ్ల తర్వాత అఖిల్‌కి ఓ ఫోన్ కాల్ వస్తుంది. అది అతని జీవితాన్నే మలుపు తిప్పుతుంది. సరిగ్గా అదే టైంలో అతని ఫోన్ కూడా చోరీ అవుతుంది. దానికోసం అఖిల్ విన్యాసాలు చేస్తాడు. రౌడీలతో తలపడేందుకు రంగంలోకి దిగుతాడు. ఇంతకీ అఖిల్‌కి ఫోన్ చేసింది ఎవరు? చిన్నప్పుడు విడిపోయిన సోల్‌మేట్‌ని అఖిల్ తిరిగి కలుసుకోగలిగాడా? అసలు ఇతని ఫోన్ ఎలా చోరీ చేయబడింది? దొంగతనం చేసిన ఆ రౌడీ గ్యాంగ్ ఎవరు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
ఈ సినిమా స్టోరీలైన్.. ఫోన్ రాగానే లిఫ్ట్ చేసి ‘హలో’ చెప్పేంత చాలా చిన్నది. కానీ.. దాని చుట్టూ విక్రమ్ కుమార్ రాసుకున్న స్ర్కీన్‌ప్లే మాత్రం మైండ్‌బ్లోయింగ్. వెండితెరపై అతను తీర్చిదిద్దిన సీన్స్, వాటిమధ్య లింకప్.. అబ్బబ్బాబ్బా.. నోరు తెరుకుని చూస్తుండిపోతాం అంతే! ఒక చిన్న స్టోరీలైన్‌కి ఇలాంటి స్ర్కీన్‌ప్లే రాసుకోవచ్చా? అని సంభ్రమాశ్చర్యంలో మునిగిపోయేలా చేశాడు విక్రమ్. కథ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఒకదాని తర్వాత ఒక సీన్ చాలా నీటుగా రాసుకున్నాడు. మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు కూడా దిమ్మతిరిగిపోయేలా చేస్తాయి. అసలు ఫస్ట్ నుంచి చివరి వరకు ‘వావ్’ అనుకుంటూ నోరెళ్లపెట్టుకోవాల్సిందే. ఇక మీరే అర్థం చేసుకోండి.. స్ర్కీన్‌ప్లే ఏ స్థాయిలో ఉంటుందో. ఈ సినిమా చూశాక విక్రమ్‌ని ట్యాలెంటెడ్ డైరెక్టర్ ఎందుకంటారో స్పష్టంగా తెలిసిపోతుంది.
ఫస్టాఫ్‌లోని స్టార్టింగ్‌లోనే స్టోరీ మొత్తం చెప్పేశాడు. ఆల్రెడీ ట్రైలర్‌లో చెప్పిందే ఈ చిత్రం కథ. ఆ తర్వాత కొద్దిసేపు హీరో, అతని తల్లిదండ్రుల మధ్య కొన్ని సీన్లు సాగగా.. అఖిల్‌కి ఫోన్ కాల్ వచ్చినప్పటి నుంచి మరో స్థాయికి స్టోరీ మలుపు తీసుకుంటుంది. అక్కడి నుంచి ప్రతి సీన్ ఇంట్రెస్ట్ పెంచుకుంటూ పోతుంది. తర్వాత ఏం జరిగింది? అసలా ఆ ట్విస్ట్ ఎలా వచ్చింది? అసలేం జరగబోతోంది? అనే ఉత్కంఠతో స్టోరీని నడిపించాడు విక్రమ్. మధ్యలో ఫ్యామిలీ సెంటిమెంట్, హీరో-హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్స్ కూడా బాగున్నాయి. అయితే.. కొన్నిచోట్ల మాత్రం విక్రమ్ కాస్త లెంగ్తీగా సాగదీశాడు. కాకపోతే.. అలా చెప్తేనే పాయింట్‌ని సరిగ్గా క్యాచ్ చేయగలం కానీ, దాన్ని మరింత సులువుగా మార్చి ఉంటే బాగుండేది. ఇంటర్వెల్, ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్.. ఈ మూడు సినిమాకే మేజర్ ప్లస్ పాయింట్స్. అక్కడొచ్చే ట్విస్టులకి ఆడియెన్స్ షాకవ్వాల్సిందే.
ఇక యాక్షన్ సీన్లు నిజంగానే హాలీవుడ్‌ని తలపించే విధంగా ఉన్నాయి. విక్రమ్ వాటిని స్ర్కీన్‌పై ప్రెజెంట్ చేసిన విధానం సగటు ప్రేక్షకుడ్ని మైమరిపించేస్తాయి. అఖిల్ కూడా ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో అదరగొట్టేశాడు. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ఈ మూవీకి ప్లస్ పాయింట్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చించేశాడు. హాలీవుడ్ స్థాయిలో ఇచ్చాడు. ఎడిటింగ్, నాగార్జున నిర్మాణ విలువలు అదిరిపోయాయి.

నటీనటుల ప్రతిభ :
అఖిల్ ఈ సినిమాకి ప్రాణం పోశాడు. అతని కష్టం వెండితెరపై స్పష్టంగా కనిపిస్తోంది. రొమాన్స్, డ్యాన్స్, ఎమోషన్స్, యాక్షన్.. ఇలా అన్నింటిలోనూ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎక్కడా ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా అదరహో అనిపించేలా తన నటనాప్రతిభతో కట్టిపడేశాడు. కళ్యాణి ప్రియదర్శన్‌ తన తొలి సినిమాలోనే అద్భుత అభినయం కనబరిచింది. అఖిల్‌కి సరితగ్గ జోడీలా అనిపించింది. రమ్యకృష్ణ, జగపతిబాబులు తమతమ పాత్రలకి మంచి న్యాయం చేశారు. ఇక విలన్ పాత్రలో అజయ్ మరోసారి చెలరేగి పోయాడు. ఇప్పటికే విలక్షణ నటుడిగా పేరుగాంచిన అజయ్.. ఈ చిత్రంతో ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్ : – స్ర్కీన్‌ప్లే
– అఖిల్ నటన
– పాటలు
– విక్రమ్ కుమార్ డైరెక్షన్
– నాగార్జున నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్
– అక్కడక్కడ లెంగ్తీగా అనిపించే సీన్లు


రేటింగ్ : 3.25/5


Tags: Hello movie review , Hello telugu Review , Akhil's Hello Movie Full Review , Hello Review read in telugu Fonts