Middle Class Abbayi (MCA) Movie Review - Rating 3 / 5


Dec 21 2017 3:03 PM
Middle Class Abbayi (MCA)

Middle Class Abbayi (MCA) Review & Rating

సినిమా: మిడిల్ క్లాస్ అబ్బాయ్ - MCA
నటినటులు: నాని , సాయి పల్లవి , భూమిక మరియు రాజీవ్ కనకాల
దర్శకుడు: వేణు శ్రీరామ్
నిర్మాత: దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి
ఎడిటర్: ప్రావిన్ పూడి

తనదైన స్టొరీ సెలక్షన్ తో వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఇవ్వాల మన ముందుకి మిడిల్ క్లాసు అబ్బాయ్ గా వచాడు . నాని తో జోడిగా సాయి పల్లవి నటించగా మరోక కీలక పాత్రలో భూమిక నటించింది.
కథ :
నాని కి తన అన్నయ రాజీవ్ కనకాల అంటే చాల ఇష్టం. రాజీవ్ కనకాల కి జ్యోతి (భూమిక) తో పెళ్లిన తరువాత నాని కి రాజీవ్ కి మధ్య దూరం పెరుగుతుంది. దాంతో వదిన అంటే కాస్త చిరాకు పెంచుకుంటాడు నాని. అదే సమయంలో పల్లవి (పల్లవి) అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు.
ప్రభుత్వ ఉద్యోగి అయిన జ్యోతికి డ్యూటీ విషయంలో లోకల్ రౌడీ వరంగల్ శివతో గొడవ మొదలవుతుంది. దాంతో శివ ఆమెను చంపాలని ప్రయత్నిస్తాడు. దానికి నాని అడ్డుపడతాడు. ఇలా గొడవ పెద్దదై శివ నాని వదినను చంపుతానంటూ ఛాలెంజ్ చేస్తాడు. ఒక సాదా సీదా మిడిల్ క్లాస్ కుర్రాడైన నాని శివ నుండి వదినను ఎలా కాపాడుకున్నాడు ? శివను ఏం చేశాడు ? అనేదే సినిమా.
నటీ నటులు ప్రదర్శన & సాంకేతిక వర్గం:
నాని మధ్య తరగతి ఫ్యామిలీ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి తన నటనతో ఓకే అనిపించింది. అయితే తన స్థాయి పెర్ఫార్మన్స్ మాత్రం ఇవ్వలేకపోయింది. అయితే చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక నటన ఈ సినిమాకే హైలైట్. నాని వదిన పాత్రలో ఒదిగిపోయింది. నూతనంగా పరిచమయిన విలన్ పాత్రధారి విజయ్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. కాని పాత్రల్లో నేటివిటీ మిస్సైంది. రాజీవ్ కనకాల, ప్రియదర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. నరేష్, శుభలేఖ, సుధాకర్, పవిత్ర లోకేష్ తమ పాత్రలకు న్యాయం చేసారు. ఇంటర్వెల్ వరకు నాని తనదైన శైలిలో తన నటనతో నెట్టుకొచ్చాడు. భూమికకు చావు ను పరిచయం చేసే సీన్ సినిమాకు మంచి ప్లస్ అయింది. అయితే, ఇంటర్వెల్ తర్వాత రొటీన్ రోత సన్నివేశాలతో సినిమా చప్ప బడిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, రొటీన్ సెకండ్ హాఫ్ ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన కొత్తగా కొత్తగా, ఏవండోయ్ నాని గారు పాటలు మినహ మిగతావి రొటీన్ ట్యూన్లు అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దేవి స్థాయిలో లేదు. సినిమాటోగ్రాఫి బాగుంది. నాని గత కొన్ని సినిమాల నుంచి ఎందుకు రొటీన్ కధలనే ఎంచుకుంటున్నాడో అతనికే తెలియాలి. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాని, ఇకపైనైనా వైవిధ్య కధలను ఎంచుకొని తన ఫాన్స్ ని మెప్పిస్తాడని వారు ఆశిస్తున్నారు. ప్లస్
– నాని, భూమిక పాత్రలు
– ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్
– సాయి పల్లవి
మైనస్
– పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్
– నీరసమైన సెకండ్ హాఫ్
– నిర్మాణ విలువలు
తీర్పు:
దిల్ రాజు, నాని. సాయిపల్లవి, డిఎస్పి కాంబినేషన్ అదిరిపోయినా, సినిమా అవుట్ పుట్ మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. రొటీన్ ఫస్ట్ హాఫ్ తో నెట్టుకొచ్చినా, సెకండ్ హాఫ్ మాత్రం సినిమా ను ముంచింది. నాని ఫాన్స్ ని మెప్పించేదిగా ఉన్నా, సినిమాను ప్రేమించి వెళ్ళే సగటు ప్రేక్షకులను మాత్రం ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి నిరాశ పరుస్తుంది.


Tags: MCA Telugu Movie Review , Middle Class Abbayi Telugu Movie Review in telugu , Nani MCA Telugu Movie Review , Nani Middle Class Abbayi Telugu Movie Review , MCA Movie Review ,